ఆల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లేబర్ అడ్డా వద్ద అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న అల్వాల్ పోలీసులు క్లూస్ టీం ఎద్దు నర్సింహ (50) మేస్త్రిగా ఆధార్ కార్డ్ ఆధారాలతో గుర్తించారు. పోలీసులు వివరాలు తెలుసుకొని వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో అల్వాల్ పోలీసులను ఆశ్రయించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.