న్యూ బోలక్పూర్ లో నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న ప్రజలు

78చూసినవారు
న్యూ బోయిగూడ సెక్షన్ పరిధి న్యూభోలక్పూర్లో హనుమాన్ దేవాలయ పరిసర ప్రాంతాల్లో గతవారం రోజులుగా నీటి సరఫరా సరిగా లేక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సెక్షన్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. మారేడుపల్లి డివిజన్ జనరల్ మేనేజర్ తమ సెక్షన్కు తక్కువ నీరు కేటాయించడంతో సమస్య ఉత్పన్నం అవుతుందని చెప్పి తప్పించుకొంటున్నారని వాపోయారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్