కంటోన్మెంట్ నియోజకవర్గం 8వ వార్డు బొల్లారంలోని, శ్రీ రేణుక ఎల్లమ్మ కల్యాణ మహుత్సవం కనుల పండుగ జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కీర్తిశేషులు ఎమ్మెల్యే సాయన్న కూతుళ్లు లాస్య నందిత, నివేదిత హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గం ప్రజలపై రేణుక ఎల్లమ్మ ఆశీస్సులు ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని వారు అమ్మవారి కోరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టి. ఎన్. శ్రీనివాస్, పనస సంతోష్, మురళీ యాదవ్, ప్రవీణ్ యాదవ్, కాశీనాథ్, అశోక్ కుమార్, మరియు ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.