నేడు రంజాన్ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ ముస్లింలను విష్ చేశారు. ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు తెలిపారు. "అల్లా మీకు శాంతి, శ్రేయస్సును ప్రసాదించాలి. ఈ రంజాన్ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలి. అంతా సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నా" అని అన్నారు. ప్రేమ, దయ, సహనం, సంతోషాల కలయికే రంజాన్ మాసం అని లోకేశ్ అన్నారు.