తిరుమలగిరి - బొల్లారం ప్రధాన రహదారి ప్రమాదకరంగా ఉండటంతో దీనిని నుంచి వాహనదారులను రక్షించేందు కంటోన్మెంట్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. బుధవారం లాల్ బజార్ చౌరస్తా నుంచి తిరుమలగిరి వరకు ఫుట్పాత్ అక్రమాలను తొలగించారు. వాహనాలు రాకపోకలు సాఫీగా సాగేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్హార్డే తెలిపారు. ట్రాఫిక్ ఏసీపీ శంకర్రాజు, సీఐ, పలువురు పాల్గొన్నారు.