ఎల్టిటి ఎక్స్ ప్రెస్ రైల్లో నుండి పడి యువకుడు మృతి చెందిన ఘటన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది. విశాఖ పట్నం నుంచి ముంబాయికి వెళుతున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన లింగమూర్తి(26) రైల్ ద్వారం (డోర్) వద్ద నిలుచున్నాడు. రైల్ కుదుపులతో ప్రమాదవశాత్తు రైల్ నుండి పడి తలకు బలమైన గాయమయ్యింది. వెంటనే గాంధీహాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.