బంజారాహిల్స్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో షాకింగ్ రీడింగ్ నమోదైంది. వెంగళరావు పార్క్ సమీపంలో నిన్న రాత్రి 10.50 గంటల సమయంలో బైక్ (TS09EK3617)పై వెళ్తున్న వ్యక్తిని ఆపి బ్రీత్ ఎనలైజర్ టెస్టు చేశారు. అందులో 550 రీడింగ్ నమోదు కావడంతో పోలీసులు షాకయ్యారు. దీంతో రీడింగ్ చలాన్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఎంత తాగావు బ్రో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.