బేగంపేట డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ మహేశ్వరి ఓటు వేశారు. కార్పొరేటర్ దంపతులు క్యూ లైన్లో నిలబడి ఓటు వేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును అందరు వినియోగించుకోవాలని సూచించారు. కొత్తగా ఓటు హక్కు కలిగిన వారు తప్పకుండా ఆలోచించి ఓటు వేయాలన్నారు.