గాంధీ ఆసుపత్రిలో రెండు మంకీ ఫాక్స్ ఐసోలేషన్ వార్డుల ఏర్పాటు

75చూసినవారు
గాంధీ ఆసుపత్రిలో రెండు మంకీ ఫాక్స్ ఐసోలేషన్ వార్డుల ఏర్పాటు
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ముందు జాగ్రత్తగా మంకీ ఫాక్స్(ఎంఫాక్స్) బాధితుల కోసం రెండు ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేసినట్లు సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజకుమారి శుక్రవారం తెలిపారు. పురుషులకు, స్త్రీలకు వేరువేరుగా 14 బెడ్లను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకు మంకీ ఫాక్స్ పాజిటివ్ కేసులు నమోదు కాలేదని తెలిపారు. ముందు జాగ్రత్తగా ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్