సికింద్రబాద్ లో దంచికొట్టిన వర్షం

57చూసినవారు
నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది. సికింద్రబాద్ రైల్వే స్టేషన్, సితఫల్ మండి, చిలకలగూడ, బౌద్ధ నగర్, పద్మారావు నగర్, ప్యారడైజ్, మోండా మార్కెట్, బన్సిలాల్ పేట్, రాం గోపాల్ పేట, బేగంపేట్, రసూల్ పురా చౌరస్తాలో భారీ వర్షం కురుస్తోంది. ప్రయాణికులు, వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్