ముస్లింలు పవిత్ర మాసంలో నిర్వహించే ఉపవాస దీక్షలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, ఇఫ్తార్ విందుతో మత సామరస్యానికి ప్రతీకలుగా నిలుస్తాయని సికింద్రాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆదం సంతోష్ కుమార్ అన్నారు. రంజాన్ మాంసాన్ని పురస్కరించుకుని ఆదం సంతోష్ ఆధ్వర్యంలో మంగళవారం సికింద్రాబాద్లో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో అమర్నాథ్ గౌడ్, బ్రహ్మాజీ, ఆదం సృజన్ పాల్గొన్నారు.