78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రతిష్ఠాత్మక సేవ పథకాన్ని సికింద్రబాద్ మహంకాళి డివిజన్ ఏసిపి సర్ధార్ సింగ్ కైవసం చేసుకున్నారు. అత్యుత్తమ వృత్తి నైపుణ్యానికి గానూ నార్త్ జోన్ డీసీపీ సాధన రాష్మీ పెరుమాళ్ తన చేతుల మీదుగా సేవ పథకాన్ని అందజేసి అభినందించారు. తన వృత్తి పట్ల నిబద్ధత, నైపుణ్యాన్ని ప్రదర్శించిన వారికి తప్పకుండా తగిన ప్రోత్సాహం అందిస్తుందన్నారు.