గంజాయి తరలిస్తున్న యూపీకి చెందిన అరుణ్ కుమార్, దీపక్ కుమార్లను సికింద్రాబాద్లో రైల్వే పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. వారి నుంచి రూ. 2. 53 లక్షల విలువైన 10 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు జీఆర్పీ డీఎస్పీ ఎస్. ఎన్ జావెద్ తెలిపారు. సీఐ సాయి ఈశ్వర్ ఆధ్వర్యంలో ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు జరిపిన ఆకస్మిక తనిఖీల్లో వీరిని పట్టుకున్నారు.