సికింద్రాబాద్ మోండా మార్కెట్ ఓల్డ్ జైలు ఖానాలో శనివారం డివిజన్ బీజేపీ కార్పొరేటర్ దీపిక పర్యటించారు. ఇటీవల స్థానికంగా కూలిన దుకాణాల సముదాయాన్ని పరిశీలించారు. స్థానికంగా వ్యర్థాలు అలాగే ఉండడంతో ఇబ్బందిగా మారిందని కార్పొరేటర్ దృష్టికి తెచ్చారు. వెంటనే జోనల్ కమిషనర్ తో మాట్లాడిన కార్పొరేటర్ జేసీబీల సహాయంతో వ్యర్థాలను క్లియర్ చేయించారు.