ఐక్య విద్యార్థి సంఘాల నిరసనతో ఓయూలో ఉద్రిక్తత

50చూసినవారు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమి పరిరక్షించాలంటూ మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీలో ఐక్య విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులు, ప్రభుత్వం హెచ్‌సీయూ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల నిరసనతో ఓయూలో ఉద్రిక్తత నెలకొనగా, వారిని పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్