వరుసగా పడుతున్న వర్షాలకు షాద్‌నగర్ చౌదరి గూడా మండలం గుర్రంపల్లి చెరువు నిండి పూర్తిస్థాయిలో అలుగు పారుతుంది. శనివారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సందర్శించి పారుతున్న అలుగు వద్ద ప్రత్యేక పూజలు చేసారు. ఈ కార్యక్రమంలో చౌదర్ గూడా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజు కొందూరు మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి పలు గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.