'ఇప్పటం గ్రామ బాధితులకు అండగా పవన్ కళ్యాణ్'

1361చూసినవారు
'ఇప్పటం గ్రామ బాధితులకు అండగా పవన్ కళ్యాణ్'
ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణలో భాగంగా ఇళ్లు కోల్పోయిన బాధితులకు అండగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముందుకు రావడం శుభసూచకం అని కాప్రా కాపు కులాల ఐక్య వేదిక అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ రావు అన్నారు. మంగళవారం కాపు భవన్ లో శ్రీనివాస్ రావు మాట్లాడుతూ... రాష్ట్రంలో జనసేన సానుభూతి పరులను కలవాలనే, వైసిపి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడి ప్రజా సమస్యలు అక్కడే ఉన్నాయని, ప్రజా సమస్యలను గాలికి వదిలేసి వైసిపి జనసేనపార్టీ,
నాయకుల, కార్యకర్తల వెంట పడుతుందని గుర్తుచేశారు.

ప్రజల్లో జనసేనకు పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక వైసిపి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు. రాష్ట్ర అభవృద్ధి కేవలం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోనే సాధ్యమని అన్నారు. ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణలో భాగంగా ఇళ్లు, స్థలం కోల్పోయిన బాధితులకు పవన్ కళ్యాణ్ అండగా నిలవడం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మంచి రోజులు వచ్చినట్లేనని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి దాసరి ప్రసాద్, జీవన్ రావు, వి నాగు, కుమార్, నాని, బాబు లు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్