ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని కాప్రా డివిజన్ హైటెక్ కాలనీకి చెందిన హై కోర్ట్ న్యాయవాది ఆది వెంకటేశ్వరరావు తెలంగాణ హైకోర్టు పి పి గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, బి ఎల్ ఆర్ ట్రస్ట్ చైర్మన్ బండారి లక్ష్మారెడ్డి ఆది వెంకటేశ్వరరావు ను మర్యాద పూర్వకంగా కలసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో బి ఎల్ ఆర్ ట్రస్ట్ సభ్యులు బైరి నవీన్ గౌడ్, అల్లం గణేష్ యాదవ్, ముదిగొండ కాశీనాథ్, కిరణ్ గౌడ్, నాగరాజు, కృష్ణ , పప్పు మరియు శివ తదితరులు పాల్గొన్నారు.