మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కోమటి రెడ్డి రాజ గోపాల్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని బిజెపి నాయకులు మల్ రెడ్డి సతీష్ రెడ్డి దిమా వ్యక్తం చేశారు. మంగళవారం కాప్రా సర్కిల్ పరిధిలోని తన కార్యాలయంలో మాట్లాడుతూ దేశంలో ప్రధాని నరేంద్ర మోడి దేశంలో ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు బిజేపి అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపిస్తాయని అన్నారు. అంతేకాక రాష్ట్రంలో బిజేపి అధికారాన్ని కైవసం చేసుకోవడం ఖాయమని ఆశాభావం వ్యక్తంచేశారు.