తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని మలుపు తిప్పిన నేత మాజీ సీఎం కేసీఆర్ అని బీఆర్ఎస్వీ నాయకులు అన్నారు. శుక్రవారం దీక్షా దివస్ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల ముందు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఆయనతో పాటు తుంగ బాలు, కొంపల్లి నరేష్, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.