జననేత పవన్ కళ్యాణ్ కు జెడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించాలి

473చూసినవారు
జననేత పవన్ కళ్యాణ్ కు జెడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించాలి
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఇంటి ముందు రిక్కి నిర్వహించడం, అలాగే పవన్ కళ్యాణ్ పే జరుగుతున్న దాడులకు కాప్రా కాపు కులాల ఐక్యవేదిక తరపున తీవ్రంగా ఖండిస్తున్నాట్లు కాప్రా కాపు కులాల అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ రావు తెలిపారు. ఈ సందర్భంగా కాప్రాలో శనివారం కాపు భవన్ లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ని అంతమొందించడానికి 250 కోట్లు సుపారి అందిందని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలుస్తోందని, ఆగస్టు 19న కడప జిల్లా సిద్ధవటం లో జరిగిన రైతు భరోసా సభలో కూడా కిరాయి హంతకులు సంచారం ఉన్నట్లు గుర్తించారని అన్నారు. ఈఘటన ను తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కాపు, మున్నూరు కాపు సమాజం తీవ్రంగా చర్యను ఖండిస్తుందని అన్నారు.

పవన్ కళ్యాణ్ పై జరుగుతున్న దాడులను ఉద్దేశించి తక్షణమే రక్షణ కల్పించాలని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను కాపు కులాల ఐక్యవేదిక తరపున డిమాండ్ చేశారు. కేంద్రం వెంటనే చొర తీసుకొని జెడ్ ప్లస్ కేటగిరీని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాపు కులాల ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి దాసరి ప్రసాద్, కోశాధికారి వీ నాగు, సతీష్ నాగేశ్వరరావు, రామ్మోహన్ రావు, శివ, సిహెచ్ రాము తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్