భవన నిర్మాణ రంగం తెలంగాణ బిల్డింగ్ ఆర్డర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మూడవ మహాసభలను విజయవంతం చేయాలని భవన నిర్మాణ రంగ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు జే వెంకన్న కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రామంతపూర్ లో ప్లంబర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈనెల 8, 9వ తేదీలలో మహబూబాబాద్ లో జరగబోయే రాష్ట్ర మూడవ మహాసభలకు సంబందించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. అనంతరం వెంకన్న మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా భవన నిర్మాణ రంగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆరోపించారు. తెలంగాణలో బిల్డింగ్ ఆర్డర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్(కార్మికులు) చాలి చాలని వేతనంతో దుర్లబ జీవితాన్ని గడుపుతున్నారని అన్నారు. మహబూబాబాద్ లో8, 9, తేదీలలో జరగబోయే రాష్ట్ర మూడవ మహాసభలను రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు పెద్ద ఎత్తున హాజరై సభలను విజయవంతం చేసి, తమ హక్కులను సాధించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ రంగ మేడ్చల్ జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్ జంగయ్య, జిల్లా కమిటీ సభ్యుడు ఎం కృష్ణ మరియు యూనియన్ నాయకులు ఎల్లయ్య, లాలు స్వామి, సిద్దు, రాజు, ఇస్తార్, శివ, మధు, భరత్, అమిత్ తదితరులు పాల్గొన్నారు.