తార్నాక చౌరస్తాను పునరుద్ధరించడానికి ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసి అధికారులు కసరత్తు షురూ చేశారు. తార్నాక చౌరస్తాలోని జంక్షన్ సిగ్నల్ ను పునఃప్రారంభించడానికి ట్రాఫిక్ అదనపు కమిషనర్ విశ్వప్రసాద్, జిహెచ్ఎంసి సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ రవికిరణ్ చౌరస్తాను పరిశీలించారు. కొద్దిపాటి మార్పులతోనే చౌరస్తాను, అదేవిధంగా ట్రాఫిక్ సిగ్నల్ ను ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని అధికారులు తెలిపారు.