తార్నాక డివిజన్ లోని డిప్యూటీ మేయర్ క్యాంప్ కార్యాలయంలో గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, టిటియుసి రాష్ట్ర అధ్యక్షులు మోతే శోభన్ రెడ్డి తో కలిసి మట్టి గణపతి ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ. పర్యావరణాన్ని రక్షించుకోవడానికి మట్టి గణపతిని ప్రతిష్టించడమే ఉత్తమ మార్గమని పేర్కొన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పిఒపిగణపతుల వాడకంతో పర్యావరణానికి నష్టం జరుగుతుందన్నారు.