వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కండ్లపల్లి అటవి ప్రాంతంలో శనివారం సాయంత్రం కుళ్లిన శవం మరియు బైక్ లభ్యమైంది. నవాబ్ పేట మండలం అక్నాపూర్ గ్రామానికి చెందిన రాణా ప్రతాప్ గా పోలిసులు గుర్తించారు. గత నెలలో మన్నెగూడ పోలిస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదైంది. పోలీసులు విచారణ చేసి త్వరలోనే మృతికి గల కారణాలు తెలుపుతామన్నారు.