యాకుత్ పురా పరిధిలోని మాధన్న పేటలో రోడ్డు అధ్వానంగా మారింది. పాత రోడ్డుపై భారీ వాహనాలు వెళ్లడంతో గుంతలు ఏర్పడ్డాయి. గత 3 నెలలుగా ఆ గుంతల్లో డ్రైనేజీ ఓవర్ ఫ్లో వాటర్ నిలిచిపోయి ఇబ్బందికరంగా మారింది. ఇటువైపుగా అధికారులు రావడం మానేశారని, సిబ్బంది చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని వ్యాపారులు, కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని గురువారం స్థానికులు కోరుతున్నారు.