ముందు హైడ్రా కమిషనర్ ఆఫీసును కూల్చాలి: కేటీఆర్ (వీడియో)

81చూసినవారు
కూల్చాల్సి వస్తే మొదటగా హైడ్రా కమిషనర్ కార్యాలయాన్ని కూల్చాలి అని కేటీఆర్ అన్నారు. "8 ఏళ్ళు మున్సిపల్ మినిస్టర్ గా పని చేసిన అనుభవంతో నేను చెబుతున్నాను. కూల్చాల్సి వస్తే మొదట కూల్చాల్సింది హుస్సేన్ సాగర్ నాలా మీద ఉన్న బుద్ధభవన్‌ను కూల్చాలి. అందులోనే హైడ్రా కార్యాలయం ఉంది. బుద్ధభవన్‌లోనే హైడ్రా కమిషనర్ ఉంటారు, ఎలక్షన్ కమిషనర్ ఉంటారు." అని కేటీఆర్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్