ప్రభుత్వ చర్యల పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ‘హైడ్రా’ నోటీసులు లేకుండా ఇళ్ళు కూల్చేయడంపై బాధితులు మండిపడుతున్నారు. అలాగే మూసీ పరివాహక ప్రాంత ప్రజల్లోనూ బుల్డోజర్ల భయం నెలకొంది. 'నెక్ట్స్ బాధితులు మేమేనా?' అంటూ కరపత్రాల ప్రదర్శనతో మూసీ బాధితులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధి పేరుతో తమ జీవితాలను ఆగం చేయొద్దని, తమ ఇళ్ళ జోలికి రావొద్దని ప్రభుత్వానికి మూసీ బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.