TG: చెరువులు, ప్రభుత్వ స్థలాల సంరక్షణే కాదు.. విపత్తుల నిర్వహణా లక్ష్యంగా పనిచేయాలని హైడ్రా నిర్ణయించింది. ముఖ్యంగా భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఏలాంటి నష్టం జరగకుండా చేయాలంటే ప్రజలను అప్రమత్తం చేయడానికి ముందస్తు సమాచారం ఇవ్వడం ముఖ్యం. అందుకోసం HYDలో మరో డాప్లర్ వెదర్ రాడార్ సెంటర్ ఏర్పాటు చేయాలని హైడ్రా సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్‌తో హైడ్రా కమిషనర్ రంగనాథ్ చర్చించారు.