హైడ్రా, మూసీ సుందరీకరణపై బురద జల్లుతున్నారని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రతిపక్షాలు వాస్తవాలకు దగ్గరగా మాట్లాడాలని సూచించారు. తమ ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లోనే పేదలు, రైతులు, మహిళల కోసం అనేక సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు చేశామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద విషం చిమ్మేందుకు సోషల్ మీడియాపై కేటీఆర్ భారీగా ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు వాస్తవాలను గ్రహించాలని సూచించారు.