తనతో సంబంధం వల్లే నటుడు జయం రవి ఆయన భార్యకు విడాకులు ఇచ్చారన్న ప్రచారంపై సింగర్ కెనీషా మరోసారి స్పందించారు. ‘ఆయనకు నాకు మధ్య శారీరక సంబంధం లేదు. మా మధ్య ఉన్నది కేవలం వ్యాపారపరమైన సంబంధమే. ఆయన నాకు మంచి మిత్రుడు. రవి విడాకుల నిర్ణయానికి నేను కారణం కాదు. ఆ ప్రచారం పూర్తిగా అవాస్తవం. ఈ వివాదంలోకి నన్ను లాగొద్దు’ అని ఓ ఇంటర్వ్యూలో అన్నారు.