ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంలో గురువారం విచారించిన ఏసీబీ అధికారులకు అన్ని విధాలుగా సహకరించానని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఏసీబీ విచారణ అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. 'విచారణకు ఎన్నిసార్లు పిలిచినా.. హాజరవుతానని చెప్పాను. ఇది ఒక చెత్త కేసు అని.. విచారణ అధికారులకు కూడా చెప్పాను. ఏసీబీ అధికారులు కొత్తగా అడిగిందేమీ లేదు. నాలుగైదు ప్రశ్నలనే తిప్పి తిప్పి నలభై రకాలుగా అడిగారు' అని వ్యాఖ్యానించారు.