ఆంధ్రప్రదేశ్ మాజీ CM జగన్‌ను తాను కలిసినట్లు జరుగుతున్న ప్రచారాన్ని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ Xలో ఖండించారు. ‘జగన్‌తో భేటీ అయినట్లు కొందరు నీచులు ఫేక్ ఫొటోలు సృష్టించారు. ఈ వార్తలను ఎవరూ నమ్మొద్దు. నేనెప్పుడూ జగన్‌ను కలవలేదు’ అని పోస్టు చేశారు. కాగా కాంగ్రెస్‌లో YCPని విలీనం చేసేందుకు DK ద్వారా జగన్ రాయబారం చేసినట్లుగా ఓ పేపర్ క్లిప్‌ను TDP-JSP శ్రేణులు వైరల్ చేసిన విషయం తెలిసిందే.