అనారోగ్యంతో 10 కిలోల బరువు తగ్గా: దేవ్‌దత్‌

70చూసినవారు
అనారోగ్యంతో 10 కిలోల బరువు తగ్గా: దేవ్‌దత్‌
2022-23 సీజన్‌లో అనారోగ్యం కారణంగా 10 కిలోల బరువు తగ్గినట్లు కర్ణాటక యువ ఆటగాడు దేవ్‌దత్‌ పడిక్కల్‌ పేర్కొన్నాడు. రాజ్‌కోట్‌లో ఇంగ్లాండ్‌తో జరగనున్న మూడో టెస్టు కోసం టీమ్‌ ఇండియా నుంచి పిలుపునందుకొన్న తర్వాత అతడు స్పందించాడు. టెస్టుల్లో ఆడటం తన కల అని పేర్కొన్నాడు. ఉదర సంబంధ సమస్యతో ఇబ్బంది పడుతూనే 2022-23 సీజన్‌ ఆడినట్లు వెల్లడించాడు. ఆ సమయంలో తరచూ అనారోగ్యానికి గురై బరువు తగ్గినట్లు తెలిపాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్