అయోధ్యలో దీపోత్సవ్ దేదీప్యమానంగా జరుగుతోంది. అయితే తనను మాత్రం ఈ ఈవెంట్‌కు ప్రభుత్వ యంత్రాంగం ఆహ్వానించలేదని సమాజ్‌వాదీ పార్టీ నేత, ఫైజాబాద్ ఎంపీ అవదేశ్ ప్రసాద్ తెలిపారు. కలిసి చేసుకునే పండుగలను కూడా బీజేపీ రాజకీయం చేస్తోందని ఆరోపించారు. సోదరభావంతో అందరూ కలిసికట్టుగా చేసుకునే పండుగ ఇది. ఇక్కడ కూడా రాజకీయాలు చేసి ప్రజలను విడగొట్టాలని బీజేపీ చూస్తోంది అన్నారు.