‘గతంలో తానొక చిప్స్ బ్రాండ్ ప్రకటన ఆడిషన్‌కు వెళ్లానని, సిక్స్ ప్యాక్ లేదని నన్ను రిజక్ట్ చేశారు’ అని నటుడు నవీన్ పొలిశెట్టి తెలిపారు. బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న సెలబ్రిటీ టాక్ షో ‘అన్‌స్టాపబుల్ సీజన్ 4’ కార్యక్రమంలో నటీనటులు శ్రీలీల, నవీన్ పొలిశెట్టి సందడి చేశారు. ‘కిస్సిక్’ పాటకు ఈ ముగ్గురూ స్టెప్పులేశారు. అందుకు సంబంధించిన ప్రోమో ఇవాళ విడుదలైంది.