పుష్ప-2 మూవీపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 'పుష్ప-2 సినిమా చూసాను.. నా మూడున్నర గంటల టైం వేస్ట్ అయింది. ఈ లోపు 10 ఊర్లు తిరిగేవాడిని. ఈ సినిమా చూసి యువకులు చెడిపోతున్నారు. ఇకపై నేను దేవుడి సినిమాలు, హిస్టరీ సినిమాలు, రాజుల సినిమాలు, తెలంగాణ సినిమాలు తప్ప వేరే తెలుగు సినిమాలు చూడను' అని వ్యాఖ్యానించారు.