'నీ కడుపులో కత్తితో పొడుస్తా': ట్రాఫిక్ పోలీసుకు వృద్ధుడి వార్నింగ్ (వీడియో)

1520చూసినవారు
వాహనానికి చలాన్ వేయడంతో ఓ వృద్ధుడు రెచ్చిపోయాడు. ట్రాఫిక్ పోలీసును బహిరంగంగా బెదిరించాడు. ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లా చందౌసి కొత్వాలి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హెల్మెట్ ధరించకపోవడంతో ఓ ట్రాఫిక్ పోలీస్ సదరు బైక్‌కి చలాన్ వేశాడు. చలాన్ అందుకున్న వృద్ధుడు ట్రాఫిక్ అధికారిని బెదిరిస్తూ ‘ఇంకెప్పుడైనా నా వాహనాన్ని ఆపివేస్తే, నేను కత్తితో వచ్చి నిన్ను పొడుస్తాను’ అన్నాడు. ఈ ఘటన అనంతరం పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్