నాగచైతన్య, సాయి పల్లవి కలిసి జంటగా నటిస్తోన్న మూవీ తండేల్. ఈ మూవీ ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగ చైతన్య కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శోభిత ధూళిపాళ్లతో తాను అన్ని విషయాలు ఎంతో ఆనందంగా పంచుకుంటానని, కీలక విషయాల్లో అయోమయానికి లోనైన సమయంలో ఆమె ఎంతో సపోర్ట్‌గా నిలుస్తుందని అన్నారు. శోభితతో జీవితాన్ని పంచుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.