ఈ లేడీ ఆఫీసర్‌కు సెల్యూట్ చేయాల్సిందే!

77చూసినవారు
నూజీవీడు ఆర్టీవో భవాని శంకరి సాహసం అందరికి ఆదర్శంగా నిలుస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో ఆమె చేసిన పనికి అందరూ సెల్యూట్ కొడుతున్నారు. అనుభవం లేకపోయినా తన పరిధిలో ఉండే ప్రజలను కాపాడేందుకు 8 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. ఫీల్డ్‌లోనే ఉంటూ పోలీసులతో కలిసి లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న 82 మంది ప్రాణాలు కాపాడటంలో కీలక పాత్ర పోషించారు. ఆపదొచ్చినప్పుడు భయపడకుండా ప్రజల్లో ధైర్యం నింపిన ఆమెపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత పోస్ట్