రైతులు అవగాహన లోపంతో పంట పొలాల్లో యూరియాను అధిక మోతాదులో వాడుతున్నారు. దీంతో పంటకు తీవ్ర నష్టం జరుగుతుందని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. యూరియా అతిగా వాడటం వల్ల మొక్క ఎక్కువ పచ్చగా, ఎక్కువ మెత్తగా మారుతుంది. దీంతో చీడపీడలు అధికమయ్యే అవకాశముంది. దీంతో పురుగుల మందులు ఎక్కువగా ఉపయోగించాల్సి వస్తుంది. అలాగే నేలలో సేంద్రీయ పదార్ధం తగ్గి నేల నిస్సారమవుతుంది.