ముర్రా జాతి గేదెల ద్వారా పాడి రైతులు స్థిరమైన ఆదాయం పొందవచ్చని పశు సంవర్థక శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ జాతి గేదెలు ఎంత మేత తిన్నా, దాన్ని మొత్తం పాలుగా మార్చుకునే సామర్థ్యం ఉంటుందన్నారు. "ఒక నాటు గేదెకు రూ.100 ఖర్చు పెడితే రూ.110 ఆదాయం మాత్రమే వస్తుంది. అదే ముర్రా జాతి గేదెపై రూ.100 పెట్టుబడి పెడితే రూ.200 ఆదాయం వస్తుంది." అని అధికారులు వివరిస్తున్నారు.