ఉపరితల ఆవర్తనం వల్ల తెలంగాణలో నేటి నుంచి రెండు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, నాగర్‌కర్నూల్, నారాయణపేట, గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. మరోవైపు ఏపీలో ఎండతో పాటు వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.