రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమించిన సత్యపాల్, సైపుద్దీన్ కిచ్లూలను బ్రిటిష్ ప్రభుత్వం నిర్బంధించింది. ఈ వార్తతో 1919, ఏప్రిల్ 13న అమృత్‌సర్‌లోని జలియన్ వాలాబాగ్ మైదానంలో సుమారు 20వేల మంది సభకు హాజరయ్యారు. మైదానం చుట్టూ ఎత్తయిన గోడ, ఒక్కటే మార్గం. జనరల్ డయ్యర్ 50 మంది సాయుధ దళం 10 నిమిషాల పాటు 1650 రౌండ్లు కాల్పులు జరిపింది. 379 మంది చనిపోయారు. అనధికారికంగా వెయ్యి మంది, 2వేల మంది గాయపడ్డారు.