దక్షిణ మధ్య రైల్వే అధికారులు కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లే గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను ఈనెల 3 నుంచి 11 వరకు దారిమళ్లిస్తున్నట్లు తెలిపారు. దీంతో విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం రైల్వేస్టేషన్లలో ఈ రైలు ఆగదని.. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే దీనిపై పలువురు ప్రయాణికులకు సందేశాలు పంపినట్లు పేర్కొన్నారు.