ఉత్తరప్రదేశ్‌లోని బర్సాన పట్టణంలో జరిగిన హోళీ వేడుకల్లో కొంతమంది మహిళల తో అనుచితంగా ప్రవర్తించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహిళల ప్రైవేట్ పార్ట్స్ ను అసభ్యకరంగా తాకడం, నీళ్లు చల్లడం లాంటి వికృత చేష్టలకు పాల్పడ్డారు. ఈ వీడియోను నటుడు తుషార్ శుక్లా సోషల్ మీడియాలో షేర్ చేసి ఇలాంటి పనులు చేయకూడదని, బన్సరా పట్టణం యొక్క సంస్కృతిని మంట కలపవద్దని కోరారు.