కూరగాయలు, నూనె ధరలు పెరుగుదలతో సామాన్యులపై భారం పడనుంది. వీటి ధరల పెంపుతో హోటళ్లలో భోజనం, టిఫిన్ రేట్లు పెరగనున్నాయి. రూ.30 ఉన్న ప్లేట్ ఇడ్లీ ధర రూ.40 చేశారు. అన్ని టిఫిన్ ధరలూ పెరిగాయి. వీటితో పాటు పకోడి, బజ్జీల ధరలు, స్వీట్ల రేట్లు పెరగనున్నాయి. ఇప్పటికే కొందరు పెంచి విక్రయిస్తుండగా.. మరికొందరు పెంచి అమ్మకాలు చేయనున్నారు. వంట నూనెల ధరలు పెరిగితే పరోక్షంగా అన్ని ఆహార ధరలు పెరుగుతాయని ఆందోళన చెందుతున్నారు.