ములుగు ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటా: సీతక్క

81చూసినవారు
ములుగు ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటా: సీతక్క
తనను ఆదరించిన ములుగు ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. ఇవాళ కొత్తగూడ మండలంలోని సుడిగాలి పర్యటన పర్యటించి మాట్లాడారు. సుదీర్ఘమైన ఎన్నికల కోడ్ వల్ల ప్రజా పాలన ద్వారా ప్రజలకు అందవలసిన అన్ని సంక్షేమ పథకాలు కుంటుపడ్డాయన్నారు. ఎన్నికల కోడ్ ముగియడంతో ప్రజలను స్వేచ్ఛగా కలవగలుగుతున్నామని, ప్రజా పాలన దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు.

సంబంధిత పోస్ట్