ట్రైన్ లో యువతితో అసభ్య ప్రవర్తన.. హోంగార్డ్ అరెస్ట్

57చూసినవారు
ట్రైన్ లో యువతితో అసభ్య ప్రవర్తన.. హోంగార్డ్ అరెస్ట్
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ లో ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన హోంగార్డును కాచిగూడ రైల్వే పోలీసులు అరెస్టుచేశారు. ఓ కుటుంబం తిరుపతి నుంచి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ లో హైదరాబాద్ వస్తోంది. ఈ క్రమంలో కోడూరు పీఎస్ హోంగార్డు ప్రతాప్.. ఎస్-3 కోచ్ లో నిద్రిస్తున్న యువతి వద్దకు వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె తండ్రి రైల్వే పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో రైలు కాచిగూడ వచ్చిన తర్వాత పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్