తెలంగాణ గీతం: 13 చరణాలు.. 2.30నిమిషాల నిడివి?

11478చూసినవారు
తెలంగాణ గీతం: 13 చరణాలు.. 2.30నిమిషాల నిడివి?
తెలంగాణ రాష్ట్ర గీతం 'జయ జయహే తెలంగాణ'పై రేవంత్ ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. 13 చరణాలున్న ఈ గీతం 2.30 నిమిషాల నిడివితో రూపొందించినట్లు తెలుస్తోంది. గతంలో ఇందులో 11 చరణాలు ఉండగా.. తాజగా అదనంగా మరో 2 జోడించినట్లు తెలుస్తోంది. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజల ముందుకు రాష్ట్ర గీతాన్ని ప్రభుత్వం తీసుకురానుంది. ఈ గీతాన్ని అందెశ్రీ రచించగా.. కీరవాణి సంగీతం అందించారు.

సంబంధిత పోస్ట్